SVR labaretis: పేలిన రియాక్టర్.. తప్పిన ప్రమాదం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామం ఎస్వీఆర్ ల్యాబరేటిస్‌లో సాల్వెంట్‌ను రీసైకిలింగ్ చేస్తుండగా రియాక్టర్ పేలింది. పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా సమయానికి ఫైర్ ఇంజన్ లేక‌పోవడంతో పక్క కంపెనీ ఫైర్ వాహనంతో కంపెనీ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరణాలు సంభవించకపోవడంతో కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా ఇదే పరిశ్రమలో సంవత్సర కాలంలో రెండవ అగ్ని ప్రమాదం సంభవించించడంతో ఎప్పుడు ఏ […]

SVR labaretis: పేలిన రియాక్టర్.. తప్పిన ప్రమాదం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామం ఎస్వీఆర్ ల్యాబరేటిస్‌లో సాల్వెంట్‌ను రీసైకిలింగ్ చేస్తుండగా రియాక్టర్ పేలింది. పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా సమయానికి ఫైర్ ఇంజన్ లేక‌పోవడంతో పక్క కంపెనీ ఫైర్ వాహనంతో కంపెనీ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరణాలు సంభవించకపోవడంతో కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా ఇదే పరిశ్రమలో సంవత్సర కాలంలో రెండవ అగ్ని ప్రమాదం సంభవించించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరైన ఫైర్ సేఫ్టీ లేకుండా పరిశ్రమ నడుపుతున్నారని గ్రామస్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.