Facebook New Feature | కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన ఫేస్‌బుక్‌.. ఇక వీడియో ఎడిటింగ్‌.. అప్‌లోడ్‌ మరింత సులభం..!

Facebook New Feature | మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ యూజర్స్‌ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా ‘వీడియో ట్యాబ్‌’ ఫీచర్‌ను పరిచయం తీసుకువచ్చింది. ఈ ట్యాబ్‌తో వీడియోలను ఎడిట్‌ చేయడంతో పాటు అప్‌లోడ్‌ చేయడం మరింత సులభంకానున్నది. దీంతో పాటు రిఫైన్డ్‌ ఎడిటింగ్‌ టూల్స్‌, హెచ్‌డీఆర్‌ వీడియోలను అప్‌లోట్‌ చేయగల సామర్థ్యం, ఓల్డ్‌ వీడియో ట్యాబ్‌ స్థానంలో వీడియో ట్యాబ్‌ తదితర ఫీచర్లను సైతం […]

Facebook New Feature | కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన ఫేస్‌బుక్‌.. ఇక వీడియో ఎడిటింగ్‌.. అప్‌లోడ్‌ మరింత సులభం..!

Facebook New Feature | మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ యూజర్స్‌ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా ‘వీడియో ట్యాబ్‌’ ఫీచర్‌ను పరిచయం తీసుకువచ్చింది. ఈ ట్యాబ్‌తో వీడియోలను ఎడిట్‌ చేయడంతో పాటు అప్‌లోడ్‌ చేయడం మరింత సులభంకానున్నది. దీంతో పాటు రిఫైన్డ్‌ ఎడిటింగ్‌ టూల్స్‌, హెచ్‌డీఆర్‌ వీడియోలను అప్‌లోట్‌ చేయగల సామర్థ్యం, ఓల్డ్‌ వీడియో ట్యాబ్‌ స్థానంలో వీడియో ట్యాబ్‌ తదితర ఫీచర్లను సైతం జోడించబోతున్నది.

కొత్త ఎడిటింగ్‌ టూల్‌ సహాయంతో వీడియోను ఎడిట్‌ చేయడం మరింత సులువు కానున్నది. యూజర్లు తమ వీడియోలకు మ్యూజిక్‌, ఫిల్టర్లను యాడ్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్‌ తెలిపింది. దాంతో పాటు వీడియోలను కుదించడంతో పాటు ఎడిటింగ్‌, టైటిల్‌ను తొలగించడంతో పాటు కొత్తగా యాడ్‌ చేయవచ్చని చెప్పింది. అలాగే అదనంగా హెచ్‌డీఆర్‌లో వీడియోలన్‌ అప్‌లోడ్‌ చేయగలుగుతారని, ఇది మరిత స్పష్టంగా, నాణ్యమైన వీడియోలను అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి..

ఫేస్‌బుక్‌ కొత్తగా వీడియో ట్యాబ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. దాంతో కొత్త వీడియోలను సులభతరంగా గుర్తించడంతో పాటు చూసేందుకు వీలు కలుగుతుంది. కంపెనీ ఓల్డ్‌ వాచ్‌ ట్యాబ్‌ ప్లేస్‌లో దీన్ని రీప్లేస్‌ చేస్తున్నది. ఈ ఫీచర్‌ త్వరలో సార్ట్‌కట్‌ బార్‌లో కనిపించనున్నది. మెటా కంపెనీ దీన్ని ‘రీల్స్‌, లెన్త్‌ వీడియోలు, లైవ్‌ కంటెంట్‌ సహా ఫేస్‌బుక్‌లోని అన్ని వీడియోల కోసం ఓ స్టాప్‌ షాప్‌’గా పేర్కొంటుంది. మెటా ప్రకారం.. ‘వీడియో’ ఆప్షన్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లో ఎగువన, ఐఓఎస్‌ వర్షన్‌లో దిగువన ఉంటుంది.

రీల్స్‌ చేయడం మరింత తేలిక..

యూజర్లు ప్రత్యేక రీల్స్ విభాగంతో వీడియోల పర్సనలైజ్డ్ ఫీడ్ ద్వారా నిలువుగా బ్రౌజ్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఫేస్‌బుక్‌ ఫీడ్స్‌ రీల్స్‌ ఎడిటింగ్‌ టూల్స్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అంటే వినియోగదారులు యాప్‌ నుంచి అప్‌లోడ్‌ చేసే సమయంలో వీడియోలకు నేరుగా మ్యూజిక్‌, టెక్ట్స్‌ను, ఆడియోను యాడ్‌ చేసుకోవచ్చు. దాంతో పాటు క్లిప్‌ వేగం మార్చడం, రివర్స్‌ చేయడం తదితర ఆప్షన్స్‌ కొత్త తీసుకురానున్న ఎడిటింగ్‌ ఆప్షన్‌ను జోడించనున్నది.

ఆడియో ట్రాక్ సెలెక్షన్‌, సౌండ్‌ తగ్గింపు, ఆడియో, వీడియోల్లో వాయిస్‌ ఓవర్లను రికార్డ్‌ చేయడం తదితర విషయాలను సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో హెచ్ డీఆర్ క్వాలిటీలో వీడియోలను అప్ లోడ్ చేసే సదుపాయాన్ని కూడా మెటా కల్పించబోతోంది. అంటే యూజర్లు హై క్వాలిటీ వీడియోలను నేరుగా ఫోన్ నుంచే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మెటా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌, వీడియో కంటెంట్‌ ఫార్మాట్లను పెంచేందుకు పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్‌ రీల్స్‌ పరిమితిని 60 సెకన్ల నుంచి 90 సెకన్లకు పెంచిన విషయం తెలిసిందే.

Read Also : Keerthy Suresh | బాలీవుడ్‌లోకి ‘మహానటి’ కీర్తి సురేశ్‌..! దర్శకుడు అట్లీ నిర్మాణ సంస్థ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక..!