ఆ యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం..!
Jharkhand | యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. స్త్రీల పునరుత్పత్తి అవయవాలు ఓ యువకుడి శరీరంలో కూడా వృద్ధి చెందాయి. కడుపునొప్పితో బాధపడుతున్న అతను ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా, ఈ విషయం బయటపడింది. దీంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన 22 ఏండ్ల యువకుడు ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతనికి వైద్యులు అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించారు. పురుషాంగం […]

Jharkhand | యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. స్త్రీల పునరుత్పత్తి అవయవాలు ఓ యువకుడి శరీరంలో కూడా వృద్ధి చెందాయి. కడుపునొప్పితో బాధపడుతున్న అతను ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా, ఈ విషయం బయటపడింది. దీంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన 22 ఏండ్ల యువకుడు ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతనికి వైద్యులు అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించారు. పురుషాంగం వద్ద హెర్నియా ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా కుడి వైపున వృషణం లేదని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ యువకుడికి సర్జరీ నిర్వహిస్తున్న సమయంలోనే.. అతని కడుపులో గర్భాశయం, అండాశయం, పాలోపియన్ నాళాలు కూడా వృద్ధి చెందినట్లు తేలింది. దీంతో ఆ మూడింటిని కూడా వైద్యులు తొలగించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. పురుషుల్లో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందడాన్ని వైద్య భాషలో పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్(PMDC) అంటారని తెలిపారు. ఈ సిండ్రోమ్ కారణంగా స్త్రీ, పురుష అంతర్గత అవయవాలు ఒకే వ్యక్తిలో వృద్ధి చెందుతాయి. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.