Jani Master | హమ్మయ్యా.. ఎట్టకేలకు జానీ మాస్టర్ కల నెరవేరబోతోంది

Jani Master విధాత‌: జానీ మాస్టర్.. సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో ఒకరు. వాస్తవానికి ఆయన దర్శకుడిగా చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఓ కథ సిద్ధం చేసుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చుట్టూ తిరిగారు కూడా. పవన్ కల్యాణ్ ఆయన కథ విని.. ఇంకా డెవలప్ చేయమని చెప్పారట. ఆ తర్వాత పవన్ బిజీ కావడంతో మళ్లీ జానీ మాస్టర్ ఆయనని కలిసే సాహసం చేయలేదు. అయితే కొరియోగ్రాఫర్‌గా సౌత్‌లో స్టార్ […]

Jani Master | హమ్మయ్యా.. ఎట్టకేలకు జానీ మాస్టర్ కల నెరవేరబోతోంది

Jani Master

విధాత‌: జానీ మాస్టర్.. సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో ఒకరు. వాస్తవానికి ఆయన దర్శకుడిగా చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఓ కథ సిద్ధం చేసుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చుట్టూ తిరిగారు కూడా. పవన్ కల్యాణ్ ఆయన కథ విని.. ఇంకా డెవలప్ చేయమని చెప్పారట. ఆ తర్వాత పవన్ బిజీ కావడంతో మళ్లీ జానీ మాస్టర్ ఆయనని కలిసే సాహసం చేయలేదు.

అయితే కొరియోగ్రాఫర్‌గా సౌత్‌లో స్టార్ హీరోలందరితో పని చేసిన జానీ మాస్టర్.. ఇప్పుడు నార్త్‌లోనూ తన టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా కొరియోగ్రాఫర్‌గానే కాకుండా.. తనకున్న మరో కోరిక, కల‌ను కూడా సాకారం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఆ కల ఇప్పటికి నెరవేరింది.

ఆ కల ఏమిటని అనుకుంటున్నారా? హీరోగా నటించడం.. అవును జానీ మాస్టర్ హీరోగా ఆ మధ్య ఒక సినిమా మొదలైంది.. కానీ మధ్యలోనే ఆగిపోయింది. రీసెంట్‌గానే ఆయన హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని.. ఆదివారం జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ వదిలారు.

జానీ మాస్టర్ హీరోగా రూపొందుతోన్న సినిమాకు ‘రన్నర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథగా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. వాస్తవంగా జరిగిన సంఘటనలతో.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందట.

‘రన్నర్’ ఫస్ట్ లుక్ విషయానికి చూస్తే.. ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్స్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే.. మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు మేకర్స్. జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు తెలియజేశారు.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని, ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని.. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు వెల్లడించారు.