Godse not Razvi: మాటల మంటలు.. తొలి టెర్రరిస్ట్ గాడ్సే కాదు రజ్వీనే! ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్!

విధాత: దేశానికి తొలి టెర్రరిస్ట్ నాథూరం గాడ్సే అని, గాంధీని చంపిన గాడ్సే ఫోటోను హనుమాన్ శోభాయాత్రలో ఎలా ప్రదర్శిస్తారని, పోలీసులు ఏం చేస్తున్నారని, తాము ఒసామా బిన్ లాడెన్ ఫోటో ప్రదర్శిస్తే ఊరుకుంటారా అంటూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ అటాక్ చేశారు. ఓవైసీ అన్నట్లుగా భారతదేశానికి తొలి టెర్రరిస్ట్ గాడ్సే కాదని, రజాకార్ల ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల పై అత్యాచారాలు, […]

Godse not Razvi: మాటల మంటలు.. తొలి టెర్రరిస్ట్ గాడ్సే కాదు రజ్వీనే! ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్!

విధాత: దేశానికి తొలి టెర్రరిస్ట్ నాథూరం గాడ్సే అని, గాంధీని చంపిన గాడ్సే ఫోటోను హనుమాన్ శోభాయాత్రలో ఎలా ప్రదర్శిస్తారని, పోలీసులు ఏం చేస్తున్నారని, తాము ఒసామా బిన్ లాడెన్ ఫోటో ప్రదర్శిస్తే ఊరుకుంటారా అంటూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ అటాక్ చేశారు.

ఓవైసీ అన్నట్లుగా భారతదేశానికి తొలి టెర్రరిస్ట్ గాడ్సే కాదని, రజాకార్ల ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల పై అత్యాచారాలు, హత్యాకాండలు సాగించిన కాశీం రజ్వీనే భారతదేశ తొలి టెర్రరిస్ట్ అంటూ కౌంటర్ ఇచ్చారు.

హనుమాన్ శోభా యాత్రలో శివాజీ, వీర సావర్కర్ ఫోటోలు కూడా ప్రదర్శించారని, ఓవైసీకి మాత్రం గాడ్సే ఫోటో మాత్రమే కనిపించడం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు.