Celebrity Club | సెలబ్రిటీ క్లబ్ విల్లాలో కాల్పులు.. ఒకరికి గాయాలు
Celebrity Club అక్రమ సంబంధం నేపధ్యంలో ఘటన విధాత: హైద్రాబాద్ శామీర్ పేట సెలబ్రిటీ క్లబ్ విల్లాలో చోటుచేసుకున్న కాల్పులలో ఒకరికి గాయాలయ్యాయి. మనోజ్ అనే వ్యక్తి సిద్ధార్ధ పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల నుండి స్వల్ప గాయంతో తప్పించుకున్న సిద్ధార్ధ జరిగిన ఘటనపై షామీ్ర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మనోజ్ ఏయిర్ గన్ ను పోలీసులు ఎస్‌ఎఫ్‌ఎల్ […]

Celebrity Club
- అక్రమ సంబంధం నేపధ్యంలో ఘటన
విధాత: హైద్రాబాద్ శామీర్ పేట సెలబ్రిటీ క్లబ్ విల్లాలో చోటుచేసుకున్న కాల్పులలో ఒకరికి గాయాలయ్యాయి. మనోజ్ అనే వ్యక్తి సిద్ధార్ధ పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల నుండి స్వల్ప గాయంతో తప్పించుకున్న సిద్ధార్ధ జరిగిన ఘటనపై షామీ్ర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మనోజ్ ఏయిర్ గన్ ను పోలీసులు ఎస్‌ఎఫ్‌ఎల్ విభాగానికి పంపించారు.
నిందితుడు మనోజ్ పరారీలో ఉన్నాడు. ఈ వివాదానికి అక్రమ సంబంధం నేపధ్యమే కారణమని గుర్తించారు. సిద్ధార్ధ, స్మితలు భార్యభర్తలు. వారుండే కాలనీలో ఉంటున్న మనోజ్‌తో కలిసి స్మిత సాఫ్ట్‌వేర్ కంపనీ నడుపుతున్న క్రమంలో వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారంతో నెలకొన్న మనస్పర్ధలతో సిద్ధార్ద, స్మితలు 2019నుండి విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. సిద్దార్ధ వైజాగ్‌లో ని హిందూజా కంపనీలో ఉద్యోగం చేస్తు అక్కడే నివసిస్తున్నాడు.
స్మిత ఇంటర్ చదువుతున్న కొడుకు, కూతురుతో కలిసి మనోజ్ తో సహజీవనం చేస్తుంది. మనోజ్ టీవి సీరియల్స్ నటుడిగా కూడా పనిచేస్తున్నాడు. అయితే మనోజ్ రానురాను సిద్ధార్ధ కొడుకు, కూతురును తరుచు కొడుతుండటం, ఇంట్లో అన్ని పనులు చేయిస్తుండగా, తల్లి స్మిత నిస్సాహాయంగా ఉంటుండటంతో జరుగుతున్న సంఘటనలను స్మిత కొడుకు ఎప్పటికప్పుడు తన తండ్రి సిద్ధార్దకు తెలియచేస్తు వస్తున్నాడు.
ఇటీవల మనోజ్ ఆగడాలు భరించేలేని సిద్ధార్ధ కొడుకు చైల్డ్ వెల్ఫర్ కమిటీకి ఈనెల 12న ఫిర్యాదు చేయగా, అతడిని సీడబ్ల్యుసీ తమ సంరక్షణలో పెట్టుకుంది. తన సోదరిని కూడా మనోజ్ భారి నుండి రక్షించాలని అతడు సీడబ్ల్యుసీని కోరాడు. దీంతో స్మితను, ఆమె కుమార్తెను ఈ నెల 19న తమ ముందు హాజరుకావాలని సిడబ్ల్యుసీ ఆదేశించింది. ఈ వివాదం క్రమంలో మనోజ్ తన సోదరిని కొడుతున్నాడని సిద్ధార్ద కొడుకు తండ్రికి తెలుపడంతో అతను తన కూతురును తీసుకెళ్లేందుకు వైజాగ్ నుండి స్మిత ఇంటికి వచ్చాడు.
తన కొడుకు, కూతురులను కొట్టడంపై మనోజ్ ను సిద్దార్ధ ప్రశ్నించిన క్రమంలో ఆగ్రహంతో మనోజ్ ఎయిర్‌గన్‌తో సిద్దార్ధపై కాల్పులు జరిపాడు. తప్పించుకున్న సిద్దార్ద శామీర్‌ఫేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో స్మిత తన వద్ధకు సిద్ధార్ద రావద్ధంటు కోర్టు నుండి ఆర్డర్ కూడా తెచ్చుకుంది. అయితే సిద్ధార్ధ కొడుకు, కూతురులను మనోజ్ హింసిస్తుండటంతో అతను వారి కోసం రావడం కాల్పుల ఘటనకు దారితీసింది.
స్మిత, సిద్ధార్ద, మనోజ్, వారి పిల్లల వివాదం ప్రస్తుతం సీడబ్ల్యుసీ ముందుండగా, స్మిత మాత్రం తనకు సిద్ధార్ద వద్ధని, పిల్లలతో కలిసి మనోజ్‌తో ఉంటానని చెబుతుంది. పిల్లలు మాత్రం తమ తండ్రి సిద్ధార్దతోనే ఉంటామంటున్న నేపధ్యంలో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగనుందో మునుముందు తేలనుంది