Texas Floods| అమెరికాలో వరదల బీభత్సం..23 మంది బాలికల గల్లంతు
విధాత, హైదరాబాద్ : అమెరికాలో వరదల బీభత్సతం సృష్టిస్తున్నాయి. టెక్సాస్ లో ఆకస్మిక వరదల కారణంగా 24 మంది మృతి చెందారు. గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లోవేసవి శిక్షణా శిబిరానికి వెళ్లిన 23 మంది విద్యార్థినిలు గల్లంతయ్యారు. ఆందోళనతో వారి ఆచూకీ తెలియజేయాలని సామాజిక మాధ్యమాల్లో తల్లిదండ్రులు ఫొటోలు షేర్ చేస్తున్నారు. గల్లంతైన బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 3 గంటల్లో 15 నుంచి 40 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక జనావాసాలు నీట మునిగాయి. వీధుల్లో వరద పోటెత్తింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించినట్లుగా స్థానిక అధికారులు తెలిపారు.
అమెరికా, టెక్సాస్‌లో భారీ వరదలు
ఉప్పొంగిన గ్వాడలూప్ నది, 13 మంది మృతి.. 3 గంటల్లో 15 నుంచి 40 సెం.మీ వర్షపాతం నమోదు
వేసవి శిక్షణ శిబిరాల్లోని 23 మంది పిల్లలు గల్లంతు, సహాయకచర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు#TexasFlood pic.twitter.com/AcEZHkTVyf
— greatandhra (@greatandhranews) July 5, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram