Jagadish Reddy | మంది లాగులు ఊడగొట్టి ఏం చూస్తావు

- సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైర్
- నీళ్లున్నా ఇవ్వలేని అసమర్ధలు కాంగ్రెస్ పాలకులు
విధాత : ప్రజాతీర్పుకు…ఇచ్చిన హామీలకు కట్టుబడి పరిపాలన చేయడం చేతగాని అసమర్ధ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి లాగులు ఊడగొట్టి ఏం చూస్తాడని బీఆరెస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మల్యే జి.జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం కోదాడ నియోజకవర్గం బీఆరెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్ల ముందే నీళు పోతున్నా ఇవ్వలేని అసమర్ధ దద్దమ్మలు కాంగ్రెసోళ్లని, చంద్రబాబు, వైఎస్సార్ హయాంలోనూ నోరు మూసుకున్న చవటలని విమర్శించారు. ఆరోగ్యం బాగాలేకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాటయోధుడు మా నేత కేసీఆర్ అని జగదీశ్‌రెడ్డి పేర్కోన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరిగే జేబు దొంగనే అని, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి.. పార్టీ లేకుండా చేయడం మీ వల్ల కాదని విమర్శించారు. గతంలో ఇద్దరు సీఎంలను మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. తెలంగాణలో ఇవ్వాళ జనరేటర్ కొనడానికి రైతులు బారులు తీరాల్సి వస్తుందని, మీరు చెప్పే మార్పు ఉన్న పథకాలనలు ఉడబెరుకడమా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. మేం గత పదేళ్లలో ప్రతిపక్షాలపై ఏనాడు కేసులు పెట్టమని చెప్పలేదని, ఎవరి కోసం ఏ స్కీమ్ పెడదాం అన్న ఆలోచనలతోనే గడిపేశామన్నారు.
కాని కాంగ్రెసోళ్లు పొద్దున్న లేస్తే దొంగ మాటలు..అక్రమ కేసులు..లీక్‌లతో కాలం గడుపుతున్నారన్నారు. సీఎం రేవంత్ లాగానే ఉత్తమ్ కూడా ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నాడని, సాగునీటి సమస్యలపై మాట్లాడితే తనకు అర్ధం కావడం లేదంటాడని ఎద్దేవా చేశారు. 60 ఎండ్ల దుర్మార్గం పాలన చేసిన కాంగ్రెస్ జిల్లా ప్రజల ఫ్లోరోసిస్‌ను తరిమివేయలేకపోతే కేసీఆర్ ఆ పని చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించారన్నారు. గతంలో జిల్లాలో మూడు నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే పండగా నేడు 40 లక్షల ధాన్యం పండించి దేశానికి నల్లగొండ ధాన్యగారం అయిందన్నారు. ఓటు వేయించుకుని అబద్దపు పాలన చేస్తున్న కాంగ్రెస్ పాలకులు 420 హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు.
డిసెంబర్ 9 నుంచి ఇస్తానన్న ఆరు గ్యారంటీలు… ఎటూ పోయాయన్నారు. రైతుబంధు 15 వేలు ఎటూ పోయాయని, అన్ని పంటలకు ఇస్తాన్నన రూ.500/- బోనస్ ఎటూ పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు అడిగితే కేసీఆర్‌ను బొంద పెట్టాలంటున్నారని, రుణమాఫీ అడిగితే బెదిరిస్తున్నారని, మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని జగదీశ్‌రెడ్డి ప్రజలను కోరారు. గుజరాత్ మోడల్ పాలన అంటే… దుర్మర్గాల పాలన అని అందుకే పార్లమెంటు ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, మోసాల కాంగ్రెస్‌ను ఓడించి తెలంగాణ గొంతుక బీఆరెస్‌ను గెలిపించాలన్నారు.