Thorrur chairperson election| తొర్రూర్ లో చైర్ పర్సన్ ఎన్నిక టెన్షన్…ఎర్రబెల్లి పీఏపై దాడి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Thorrur chairperson election| తొర్రూర్ లో చైర్ పర్సన్ ఎన్నిక టెన్షన్…ఎర్రబెల్లి పీఏపై దాడి

విధాత : తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీల్లో సోమవారం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల ఎన్నికలు పోటాపోటీగా ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు పరస్పరం పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ..తోపులాటకు దిగాయి. మున్సిపల్‌ కార్యాలయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర చేరుకున్న సందర్బంలో ఆయను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.   సమీపంలోని ఓ భవనంలో ఎర్రబెల్లిని గృహ నిర్భంధం చేశారు.   ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను నియంత్రించేందుకు భారీగా మోహరించారు. మా పార్టీ అభ్యర్థులకు  విప్ గా నేను మా అభ్యర్థులకు అవసరమైన పత్రాలు జారీ చేసేందుకు వెళ్లగా నన్ను పోలీసులు అడ్డుకోవడం అన్యాయంగా ఉందన్నారు. అదే సమయంలో అమెరికా సిటిజనర్.. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని లోనికి పంపించడం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఎర్రబెల్లి మండిపడ్డారు.

తొర్రూర్ మున్సిపాల్టీలో మొత్తం 16 వార్డులకు గాను తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గెలిచిన అభ్యర్థులతో ఎర్రబెల్లి క్యాంపు నిర్వహించారు. తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకున్నారు.  ఏడింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు కాంగ్రెస్ కు అనుకూలంగా తొమ్మిది ఓట్లు వచ్చాయి.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాలు మేమే గెలిచాం.. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ ఏదో చేయాలని చూస్తోంది.ఎంపీ కడియం కావ్య 2025లో వరంగల్‌లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారు.ఇప్పుడు తొర్రూర్ లో నమోదు చేసుకున్నారన్నారు. ఎంపీ కావ్య ఓటు పరిగణలోకి తీసుకుంటే కోర్టుకు వెళతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో తొర్రూరు మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ అధిక్యత దక్కించుకుంది.