Australia | మ‌హిళ‌ల‌కు.. వాడేసిన కండోమ్ పార్సిళ్లు! ఎక్క‌డంటే

విధాత‌: ఆస్ట్రేలియా (Australia)లో జుగుప్సాక‌ర‌మైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 65 మంది మ‌హిళ‌ల‌కు పార్సిళ్లు రాగా.. అందులో ఉన్నదాన్ని చూసి వారు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అందులో నిందితుడు వాడేసిన కండోములను పెట్టి ఈ 65 మందికీ పంపించాడు. కొంత మంది కండోంతో పాటు చేతిరాత‌తో కూడిన లెట‌ర్ల‌నూ అందుకున్నామ‌ని పోలీసుల‌కు తెలిపారు. ఆ పార్సిల్‌ను ఇప్పి చూసిన రోజు రాత్రంతా నిద్ర లేద‌ని ఒక మ‌హిళ వాపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు జ‌రిపిన అధికారులు కొన్ని […]

  • Publish Date - May 17, 2023 / 11:05 AM IST

విధాత‌: ఆస్ట్రేలియా (Australia)లో జుగుప్సాక‌ర‌మైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 65 మంది మ‌హిళ‌ల‌కు పార్సిళ్లు రాగా.. అందులో ఉన్నదాన్ని చూసి వారు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అందులో నిందితుడు వాడేసిన కండోములను పెట్టి ఈ 65 మందికీ పంపించాడు.

కొంత మంది కండోంతో పాటు చేతిరాత‌తో కూడిన లెట‌ర్ల‌నూ అందుకున్నామ‌ని పోలీసుల‌కు తెలిపారు. ఆ పార్సిల్‌ను ఇప్పి చూసిన రోజు రాత్రంతా నిద్ర లేద‌ని ఒక మ‌హిళ వాపోయింది.

ఈ ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు జ‌రిపిన అధికారులు కొన్ని ఆస‌క్తిక‌ర అంశాల‌ను క‌నుగొన్నారు. ఈ 65 మందీ 1999లో ఒకే కాలేజీలో చ‌దువుకున్నార‌ని గుర్తించారు.

వీరి అడ్ర‌స్‌ల‌ను అక్క‌డి నుంచే సేక‌రించి ఉంటార‌ని, నిందితుడు వీరికి తెలిసున్న వారే అయి ఉంటార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే కేసును ఛేదిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Latest News