Hyderabad | హైదరాబాద్‌లో అర్థరాత్రి.. ఇద్దరు హిజ్రాలతో సహ నలుగురి హత్య
విధాత: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి వేళ.. నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. పాతబస్తీలోని టపాచ్చబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు హిజ్రాలను అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మరో వైపు రాజేంద్రనగర్ ప్రాంతంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టపాచ్చబుత్ర పరిధిలో హత్యకు గురైన హిజ్రాల మృతదేహాలను […]

విధాత: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి వేళ.. నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. పాతబస్తీలోని టపాచ్చబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు హిజ్రాలను అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మరో వైపు రాజేంద్రనగర్ ప్రాంతంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు.
ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టపాచ్చబుత్ర పరిధిలో హత్యకు గురైన హిజ్రాల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు హిజ్రాలు దైబాక్ ప్రాంతానికి చెందిన యూసఫ్ అలియాస్ డాలీ, రియాజ్ అలియాస్ సోఫియాగా పోలీసులు గుర్తించారు.
ఈ జంట హత్యలకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలంలో లభ్యమైన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ కిరణ్ మాట్లాడుతూ.. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ హత్యలు జరిగినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు.
HYDERABAD: Two Transgenders were Murdered by Unknown Persons At Tappachabutra on the Intervening Night of Tuesday and Wednesday.DCP Southwest Sri.Kiran Khare IPS Reached On Spot @DCP_SWZ @shotappachbutra @acpgoshamahal pic.twitter.com/pe8KSGaQ4E
— Reporter shabaz baba (@ShabazBaba) June 21, 2023
మృతులు ఇద్దరు కూడా ట్రాన్స్‌జెండర్లు అని, వారి వయసు 25 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. అయితే అక్రమ సాన్నిహిత్యం కారణంగా హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
రాజేంద్రనగర్‌లో కూడా ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దుర్గా నగర్ చౌరస్తా నుంచి శంషాబాద్‌కు వెళ్లే రోడ్డులో దుప్పట్లు అమ్ముకునే వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. అదే ప్రాంతంలో నిద్రిస్తున్న మరో వ్యక్తిని ఇదే తరహాలో చంపేశారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జంట హత్యలపై విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు.