ముక్కు లేకుండా ఏండ్లు: చేతిపై ముక్కును పెంచి.. ముఖానికి అతికించారు
Nose | విదాత: ఫ్రాన్స్ సర్జన్లు చరిత్ర సృష్టించారు.. మహిళ చేతిపై ముక్కును పెంచి, దాన్ని ముఖానికి అతికించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సర్జన్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఓ మహిళ 2013లో క్యాన్సర్ బారిన పడింది. రేడియో థెరపీ, కీమోథెరపీ నిర్వహించారు. నాజల్ కావిటీ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మహిళ తన ముక్కును కోల్పోయింది. అయినప్పటికీ ఆమె ముక్కు లేకుండానే ఏండ్ల పాటు బతకగలిగింది. అయితే […]

Nose | విదాత: ఫ్రాన్స్ సర్జన్లు చరిత్ర సృష్టించారు.. మహిళ చేతిపై ముక్కును పెంచి, దాన్ని ముఖానికి అతికించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సర్జన్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన ఓ మహిళ 2013లో క్యాన్సర్ బారిన పడింది. రేడియో థెరపీ, కీమోథెరపీ నిర్వహించారు. నాజల్ కావిటీ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మహిళ తన ముక్కును కోల్పోయింది. అయినప్పటికీ ఆమె ముక్కు లేకుండానే ఏండ్ల పాటు బతకగలిగింది.
అయితే టౌలూజ్ యూనివర్సిటీ ఆస్పత్రి డాక్టర్లు 3డీ- ప్రింటెడ్ బయో మెటీరియల్‌తో చేతిపై ముక్కును పెంచారు. ముక్కు పెరిగిన తర్వాత రెండు నెలలకు దాన్ని కత్తించారు. ఆ తర్వాత మహిళ ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు సర్జన్లు.
మైక్రో సర్జరీ ద్వారా.. ముఖం వద్ద ఉండే రక్తనాళాలను ఒక్కోదాన్ని 3డీ ముక్కు రక్తనాళాలతో కలుపుతూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ మేరకు టౌలూజ్ యూనివర్సిటీ డాక్టర్లు చేయిపై పెరుగుతున్న ముక్కు చిత్రాలను నిన్న షేర్ చేసింది. రెండు నెలల పాటు చేయిపై ముక్కును పెంచినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై అతికించిన ముక్కు సక్రమంగా పని చేస్తుందన్నారు.