High Court | గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి షాక్.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
High Court | గద్వాల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు ఎమ్మెల్యేగా గుర్తించాలని ఈసీకి కోర్టు ఆదేశం కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమానా అందులో 50 వేలు అరుణకు ఇవ్వాలని ఆదేశం విధాత, హైదరాబాద్, గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గురువారం సంచలన తీర్పును వెలువరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా డీకే అరుణ […]

High Court |
- గద్వాల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు
- ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు
- ఎమ్మెల్యేగా గుర్తించాలని ఈసీకి కోర్టు ఆదేశం
- కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమానా
- అందులో 50 వేలు అరుణకు ఇవ్వాలని ఆదేశం
విధాత, హైదరాబాద్, గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గురువారం సంచలన తీర్పును వెలువరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా డీకే అరుణ (ప్రస్తుత బీజేపీ ఉపాధ్యక్షురాలు) కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో డీకే అరుణకు 72,155 ఓట్లు రాగా.. కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,415 ఓట్లు వచ్చాయి. 28,260 ఓట్ల మెజార్టీతో డీకే అరుణపై కృష్ణమోహన్‌రెడ్డి విజయం సాధించారు.
దీంతో ఓటమిపాలై రెండో స్థానంలో దక్కించుకున్న డీకే అరుణ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక సరైందికాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అతని ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాడ్స్ చీటీలను సరిగ్గా లెక్కించలేదని ఆమె పిటిషన్‌లో తెలిపారు.
దీనిపై గురువారం జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించిన నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించింది. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కృష్ణమోహన్‌రెడ్డికి రూ.3 లక్షల జరిమానా విధించింది. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు ఆదేశాలు జారీ చేసింది.