Shivaji | బిగ్‌బాస్ హౌసులో.. గరుడపురాణం శివాజీ

Shivaji | విధాత‌: బిగ్ బాస్ సీజన్ - 7 మొదలైంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే 14 మందిని ఎంపిక చేశారు. దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా తాజాగా ఆ 14 మంది పేర్లను ప్రకటించారు. బిగ్‍బాస్ 7వ సీజన్ హౌజ్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. 1. ప్రియాంక జైన్ (సీరియల్ నటి, మౌనరాగం సీరియల్ ఫేమ్) 2. శివాజీ (సినీ నటుడు) 3. ధామిని భట్ల (సింగర్) […]

  • Publish Date - September 4, 2023 / 08:57 AM IST

Shivaji |

విధాత‌: బిగ్ బాస్ సీజన్ – 7 మొదలైంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే 14 మందిని ఎంపిక చేశారు. దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా తాజాగా ఆ 14 మంది పేర్లను ప్రకటించారు.

బిగ్‍బాస్ 7వ సీజన్ హౌజ్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు.

1. ప్రియాంక జైన్ (సీరియల్ నటి, మౌనరాగం సీరియల్ ఫేమ్)
2. శివాజీ (సినీ నటుడు)
3. ధామిని భట్ల (సింగర్)
4. ప్రిన్స్ యావర్ (మోడల్, సీరియల్ నటుడు)
5. శుభశ్రీ (నటి, న్యాయవాది)
6. షకీల (సీనియర్ నటి)
7. ఆట సందీప్ (డ్యాన్సర్, కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (సీరియల్ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ యాక్టర్, యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్)
10. రతిక రోజ్ (నటి, నేను స్టూడెంట్ సార్ మూవీ ఫేమ్)
11.గౌతమ్ కృష్ణ (సినీ నటుడు, ఆకాశ వీధుల్లో ఫేమ్)
12. కిరణ్ రాథోడ్ (పలు భాషల్లో హీరోయిన్‍గా నటించింది)
13. పల్లవి ప్రశాంత్ (రైతు – యూట్యూబర్)
14. అమర్‌దీప్ చౌదరి (సీరియల్ నటుడు, జానకి కలగనలేదు ఫేమ్)

ఇక ఈ 14 మందిలో మిగతావారంతా ఒకెత్తు శివాజీ ఒక్కరే ఒక ఎత్తు. గత 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం తరఫున భారీగా ప్రచారం చేయడం, గరుడ పురాణం పేరిట టివి – 9లో పెద్ద ఎపిసోడ్ నడపడం వంటి చర్యలతో పాపులర్ అయిన శివాజీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు.

తెలుగుదేశం మద్దతుదారుగా అయిన శివాజీకి అప్పట్లో టీవీ – 9 ఇంకా కొన్ని తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థల్లో విస్తృత ప్రచారం వచ్చేది. తన స్థాయికి మించి మాట్లాడడం.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఏదేదో కామెంట్లు చేయడం ఇలాంటి ఎపిసోడ్లతో అయన బాగా ప్రాచుర్యం పొందారు.

ఎన్నికల తరువాత టీడీపీ ఓడిపోవడంతో మూడేళ్లు ఎక్కడా కనిపించని శివాజీ మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లలో హడావుడి చేస్తున్నారు. అప్పట్లో అమరావతి ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటం వంటిది అని అయన అనేవారు. ఇక ఇప్పుడు ఈయన బిగ్ బాస్‌హౌస్ లో సహచరులతో ఎలా మెలుగుతారు.. ఎన్ని మార్కులు తెచ్చేకుంటారు. అసలు ఆ హౌస్‌లో ఎన్నాళ్ళు మనగలుగుతారన్నది చూడాలి.

Latest News