గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరి సజీవ దహనం

మెదక్ జిల్లా చిన్నశువునూర్ గ్రామంలో ఘటన బాలికతో పాటు అమ్మమ్మ అంజమ్మ మృతి విధాత, మెదక్ బ్యూరో: అర్ధ‌రాత్రి నిద్రిస్తున్న స‌మ‌యంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిఇండర్ పేలి 65 సంవత్సరాల మహిళ అంజమ్మ ఆరు సంవత్సరాల బాలిక సజీవ దహనమయ్యారు. వివరాలిలా వున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివునూర్ గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ 65, ఆమె మనుమరాలు 6 సంవత్సరాల బాలిక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అంజమ్మ పింఛ‌న్ డబ్బుల […]

  • By: krs    latest    Jan 25, 2023 3:20 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరి సజీవ దహనం
  • మెదక్ జిల్లా చిన్నశువునూర్ గ్రామంలో ఘటన
  • బాలికతో పాటు అమ్మమ్మ అంజమ్మ మృతి

విధాత, మెదక్ బ్యూరో: అర్ధ‌రాత్రి నిద్రిస్తున్న స‌మ‌యంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిఇండర్ పేలి 65 సంవత్సరాల మహిళ అంజమ్మ ఆరు సంవత్సరాల బాలిక సజీవ దహనమయ్యారు.

వివరాలిలా వున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివునూర్ గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ 65, ఆమె మనుమరాలు 6 సంవత్సరాల బాలిక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.

అంజమ్మ పింఛ‌న్ డబ్బుల కోసం హైదరాబాద్ నుండి మంగళవారం సాయంత్రం మనుమరాలితో క‌లిసి చిన్న శివునూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధ‌రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరూ సజీవ దహనమయ్యారు.

పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. మంటల్లో మృత‌దేహాలు గుర్తించ‌లేనంత‌గా పూర్తిగా కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.