Viral Video | గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకొని మహిళ డ్యాన్స్.. మండిపడ్డ నెటిజన్లు

Viral Video |చాలా మంది మహిళలు డ్యాన్సులతో అదరగొడుతారు. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ విధంగానే ఓ మహిళ కూడా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆమె ఏకంగా తన నెత్తిపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని డ్యాన్స్ చేసింది. అంతేకాదు.. సిలిండర్ నెత్తిపై ఉండగానే.. కింద ఓ స్టీల్ బిందెను ఎక్కి నాట్యమాడింది. గ్యాస్ సిలిండర్‌ను తన చేతులతో పట్టుకోకుండానే ఈ సాహసం చేసింది. చివర్లో తన కుడి చేతితో, ఎడమ కాలిని పట్టుకుని తన డ్యాన్స్‌ను ముగించేసింది. సదరు మహిళ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహిళ డ్యాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి స్టంట్లు డేంజరస్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్నారు. జరగరాని ఘటనలు ఏవైనా జరిగితే కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందే అని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి స్టంట్లకు దూరంగా ఉంటే మంచిదని సూచించారు. ప్రాణాల మీదకు తెచ్చే ఈ ప్రయోగాలను ప్రోత్సహించొద్దని నెటిజన్లు సూచించారు.