మోయ‌లేని భారం మోపే వాడే.. మోదీ.. నిప్పులు చెరిగిన కేటీఆర్

విధాత: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించ‌డంపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయా సంస్థలకు రెండేళ్ల కాలానికి రూ.22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ త‌న ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక […]

మోయ‌లేని భారం మోపే వాడే.. మోదీ.. నిప్పులు చెరిగిన కేటీఆర్

విధాత: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించ‌డంపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయా సంస్థలకు రెండేళ్ల కాలానికి రూ.22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ త‌న ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం. ఆడబిడ్డలపై ఆర్థిక భారమా.? అని నిప్పులు చెరిగారు. ఆయిల్ కంపెనీలు క‌ష్టాలు త‌ప్ప‌.. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు క‌నిపించవా? అని ప్ర‌శ్నించారు. గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు..ఈ గ్యాస్ బండలు అని విమ‌ర్శించారు.

ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట అని ధ్వ‌జ‌మెత్తారు. మహిళా లోకానికి అర్థమైంది, మోయలేని భారం మోపే వాడే, మోదీ అని కేటీఆర్ పేర్కొన్నారు. పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అయింద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయిల్ కంపెనీలకు కాదు, ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ సంస్థలకు పరిహారం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. 2020 జూన్‌ నుంచి 2022 జూన్‌ వరకు వంటగ్యాస్‌ విక్రయాల్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఆయా సంస్థలకువన్‌టైం గ్రాంటు కింద రూ.22 వేల కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు పేర్కొంది.