కర్ణాటకలో గుంతల రోడ్లపై ప్రత్యక్షమైన దుర్గా మాత.. వీడియో
విధాత : దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత అమ్మవారు కర్ణాటకలోని గుంతల రోడ్లపై ప్రత్యక్షమైంది. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయా? అని అమ్మవారు ప్రశ్నించారు. అయితే సాక్షాత్తు అమ్మవారిలా.. ఓ అమ్మాయి దుర్గామాత వేషధారణలో గుంతల రోడ్లపై ప్రత్యక్షమై.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హుబ్లీలోని రోడ్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లపై గుంతలు ఏర్పడటంతో, వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో దేవీ నవరాత్రుల సందర్భంగా రెండో తరగతి చదువుతున్న […]

విధాత : దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత అమ్మవారు కర్ణాటకలోని గుంతల రోడ్లపై ప్రత్యక్షమైంది. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయా? అని అమ్మవారు ప్రశ్నించారు. అయితే సాక్షాత్తు అమ్మవారిలా.. ఓ అమ్మాయి దుర్గామాత వేషధారణలో గుంతల రోడ్లపై ప్రత్యక్షమై.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హుబ్లీలోని రోడ్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లపై గుంతలు ఏర్పడటంతో, వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో దేవీ నవరాత్రుల సందర్భంగా రెండో తరగతి చదువుతున్న హర్షిత(9) దుర్గామాత వేషధారణలో ఆ రోడ్లపై ప్రత్యక్షమైంది. నీరు నిలిచిన గుంతలోనే కాసేపు నిలబడింది. రోడ్ల దుస్థితిపై ప్రభుత్వాన్ని ఆ బాలిక ప్రశ్నించింది.
ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ.. రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రతి రోజు స్కూల్‌కు వెళ్లే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడటం, వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ప్రమాదాలు సంభవిస్తున్నాయని హర్షిత పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్లను బాగు చేయాలని ఆమె కోరారు.