వరంగల్‌లో దారుణం.. బాలికపై అన్నదమ్ముళ్ల అత్యాచారం
Warangal | ఓ ఇద్దరు కామాంధులు చెలరేగిపోయారు. బాలికపై ఇద్దరు అన్నదమ్ముళ్లు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని ఓ కాలనీకి చెందిన 15 ఏండ్ల బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే ఉంటోంది. అదే కాలనీలో ఉంటున్న ఆ బాలికపై కన్నేశారు. ఇక అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు.. ఆ బాలికను ఇంటికి పిలించుకునేవారు. బలవంతంగా అత్యాచారం చేసేవారు. […]

Warangal | ఓ ఇద్దరు కామాంధులు చెలరేగిపోయారు. బాలికపై ఇద్దరు అన్నదమ్ముళ్లు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని ఓ కాలనీకి చెందిన 15 ఏండ్ల బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే ఉంటోంది. అదే కాలనీలో ఉంటున్న ఆ బాలికపై కన్నేశారు. ఇక అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు.. ఆ బాలికను ఇంటికి పిలించుకునేవారు. బలవంతంగా అత్యాచారం చేసేవారు. ఆ సమయంలో నగ్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేవారు. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇక ఇటీవలే అన్నదమ్ములిద్దరూ బాలికకు సైగలు చేయడాన్ని ఆమె తల్లి గమనించింది. కూతురిని మందలించడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితులు అలీ(26), అబ్బు(22)పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.