Site icon vidhaatha

Girls Molest | 18 మంది అమ్మాయిల‌ను వేధించిన టీచ‌ర్.. స్కూల్ టాయిలెట్‌లో కండోమ్స్..

Girls Molest | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచ‌ర్ వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ప్ర‌ధానోపాధ్యాయుడు, మ‌రో టీచ‌ర్ స‌హ‌కారంతో.. విద్యార్థినుల‌పై విరుచుప‌డ్డాడు కంప్యూట‌ర్ టీచ‌ర్. 18 మంది మైన‌ర్ విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ.. లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. షాజ‌హాన్‌పూర్ జిల్లా తిల్హార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ సెకండ‌రీ స్కూల్‌లో మ‌హ‌మ్మ‌ద్ అలీ అనే వ్య‌క్తి కంప్యూట‌ర్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే పిల్ల‌ల‌కు కంప్యూట‌ర్ పాఠాలు బోధించ‌కుండా కామంతో చెల‌రేగిపోయాడు. మైన‌ర్ విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ, తాక‌రాని చోట తాకాడు. దీంతో ఓ అమ్మాయి తీవ్ర మ‌న‌స్తాపానికి గురై త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది.

స్థానిక నాయ‌కుల స‌హ‌కారంతో విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు తిల్హార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. కంప్యూట‌ర్ టీచ‌ర్ మ‌మ‌హ్మ‌ద్ అలీతో పాటు ప్ర‌ధానోపాధ్యాయుడు అనిల్ ప‌ఠాక్, మ‌రో టీచ‌ర్ షాజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే స్కూల్ ఆవ‌ర‌ణ‌లోని టాయిలెట్‌లో కండోమ్స్ క‌నిపించాయి. దీంతో విద్యార్థినుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 18 మంది అమ్మాయిల‌కు ఎక్స్ రే నిర్వ‌హించ‌నున్నారు. విద్యార్థినుల‌ను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version