Girl Students | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే (Teacher) వక్రబుద్ధితో వ్యవహరించాడు. పాఠాలు బోధించడం మానేసి.. బాలికలతో (Girl Students) అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించాడు. అంతటితో ఆగకుండా వీడియోలు చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh) జబల్పూర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో (Govt School)లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జబల్పూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే […]
Girl Students | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే (Teacher) వక్రబుద్ధితో వ్యవహరించాడు. పాఠాలు బోధించడం మానేసి.. బాలికలతో (Girl Students) అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించాడు. అంతటితో ఆగకుండా వీడియోలు చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh) జబల్పూర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో (Govt School)లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జబల్పూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ నెల 11న 4, 5వ తరగతులకు చెందిన అమ్మాయిలను బలవంతంగా ఓ తరగతి గదిలోకి (Class Room) తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికల చేత అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించాడు. తన ఫోన్లో ఆ డ్యాన్స్‌లను చిత్రీకరించాడు.
ఈ విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థినులను ఠాకూర్ హెచ్చరించాడు. అయితే ఓ బాలిక తీవ్ర మనస్తాపానికి గురై జరిగిన ఘోరాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో గ్రామస్థులంతా కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీచర్ రామ్‌సింగ్ ఠాకూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.