School Bags | వీళ్లు పిల్లలు కాదు మగాళ్లు.. స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్, కత్తులు లభ్యం
School Bags | ఇటీవలి కాలంలో పిల్లలు( Childrens ) పిల్లల్లా కాకుండా మగాళ్ల ప్రవర్తిస్తున్నారు. బడుల్లోనే( Schools ) బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల( Girls ) పట్ల వ్యామోహం పెంచుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

School Bags | ముంబై : ఇటీవలి కాలంలో పిల్లలు( Childrens ) పిల్లల్లా కాకుండా మగాళ్ల ప్రవర్తిస్తున్నారు. బడుల్లోనే( Schools ) బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల( Girls ) పట్ల వ్యామోహం పెంచుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కామంధుల్లా చెలరేగిపోతూ.. అమ్మాయిలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ.. ఓ పాఠశాల విద్యార్థుల బ్యాగుల్లో లభ్యమైన కండోమ్స్, మత్తు పదార్థాలు, కత్తులే.
అది మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ స్కూల్.. ఆ పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో ప్రిన్సిపల్‌తో పాటు మిగతా టీచర్లకు మార్పు కనిపించింది. ఇక ఆ పిల్లల బ్యాగులను వారానికొసారి చెక్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారానికో తరగతి పిల్లల బ్యాగులు విస్తృతంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు.
ఐదారు తరగతుల నుంచి మొదలుకుంటే 10వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో ఎవరూ ఊహించని వస్తువులు లభ్యమయ్యాయి. అవేంటంటే.. కండోమ్స్, కత్తులు, మత్తు పదార్థాలు, మరికొన్ని మారణాయుధాలు లభించాయి. వాటిని చూసి ప్రిన్సిపల్, టీచర్లు షాక్‌కు గురయ్యారు. పిల్లల్లో క్రిమినల్ మెంటాల్టీని గమనించిన తర్వాతే వారి బ్యాగులు తనిఖీలు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ వస్తువులు లభ్యమైన తర్వాత అనుమానస్పద విద్యార్థుల బ్యాగులను ప్రతి రోజు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్వాగతించారు. పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు పాఠశాల యాజమాన్యం తీసుకున్న చొరవ ప్రశంసించదగ్గదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు క్రమశిక్షణ నేర్పించేందుకు కేవలం టీచర్లే అని వారు తెలిపారు. బ్యాగుల తనిఖీ కార్యక్రమానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేరెంట్స్ స్పష్టం చేశారు.