Condoms | ఇదెక్కడి చోద్యం: కండోమ్స్‌ను.. ఇలా కూడా వాడుతారా?

Condoms |
విధాత: కండోమ్స్ వినియోగం ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఆరోగ్యకరమైన సెక్స్ కు, అవాంఛనీయ గర్భ నిరోధానికి కండోమ్స్ వాడుతుండటం అందరికి తెలిసిందే. అయితే కొందరు కండోమ్స్ ను వినూత్న పద్ధతుల్లో..ఇతర పనులకు కూడా వినియోగిస్తుండటం సోషల్ మీడియాల్ వైరల్ గా మారింది. సురక్షిత శృంగార సాధనం కాస్తా దైనందిక జీవన చర్యల సాధనంగా మార్చేశారు.
కొందరు బాత్ రూమ్ నల్లా(టాబ్ )ను క్లీన్ చేసేందుకు కండోమ్ లో క్లీనింగ్ ఫౌడర్ వేసి నల్లాకు బిగించి నల్లాను క్లీన్ చేసేందుకు వాడారు. మరొకరు ఇంటి డోర్ కు రంగులు వేసే క్రమంలో డోర్ హ్యాండిల్స్ కు రంగు అంటకుండా దానికి కండోమ్ తొడిగారు. ఇంకొకరు ఎలక్ట్రిక్ ఫ్లగ్ జాయింట్ సేఫ్టీగా కండో మ్ వినియోగించారు.
ఇంకో పెద్ధ మనిషి తన వేళ్లకు కండోమ్ ధరించి తన షూస్ ను క్లీన్ చేసుకున్నాడు. మరొకరు కండోమ్ లో ఐస్ నీటిని పోసి తన మోకాలికి తగిలిన గాయానికి చల్లదనం అందించి ఉపశమనం పొందాడు. ఇలా పలు రకాలుగా కండోమ్ లను వినియోగించిన తీరు చూసిన నెటిజన్లు కండోమ్ ను ఇన్ని రకాలుగా సద్వినియోగం చేసుకునే ట్రిక్స్ బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.