Girls Molest | దారుణం.. నాలుగేండ్లుగా ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం

Girls Molest | తన కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి.. క్రూరమృగంలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కూతుళ్లపై గత నాలుగేండ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15, 17 ఏండ్ల వయసున్న ఈ ఇద్దరు అమ్మాయిలు తరగతులకు సరిగా హాజరు కావడం లేదు. గాయాలతో బాధపడుతున్నారు. దీంతో టీచర్ వారిలో ఒకరిని పిలిపించుకుని ఏం జరిగిందని ఆరా తీసింది.
తమ తండ్రి దారుణాలను ఆమె టీచర్ వద్ద చెప్పి బోరున విలపించింది. నాన్న పని చేయడం లేదు.. అమ్మే తమకు జీవనధారమని టీచర్‌కు తెలిపింది. సాయంత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లకుండా, పార్కులో గడిపి, అమ్మ ఇంటికి చేరుకున్నాక తాము వెళ్తామని చెప్పారు.
ఈ ఘోరాన్ని టీచర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థినుల తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అత్యాచారం విషయం బయటకు చెబితే చంపేస్తానని తండ్రి బెదిరించినట్లు బాధిత అమ్మాయిలు పోలీసులకు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.