Penguins | అంటార్కిటికాలో మంచు ఫలకాల కొరత.. వేల పెంగ్విన్లు మృత్యువాత
Penguins | విధాత: వాతావరణ మార్పులు (Environmental Changes) పలు జంతు, పక్షి జాతుల నాశనానికి దారి తీస్తున్నాయి. చూడగానే ఎంతో ముద్దొచ్చే.. అచ్చం మనిషిలా నడిచే పక్షి జాతి పెంగ్విన్. భారీ మంచు పలకాలు ఏర్పడే ఆర్కిటిక్, అంటార్కిటిక్ మహా సముద్రాల్లో మాత్రమే ఇవి కనపడతాయి. ప్రస్తుతం పెరుగుతున్న సముద్ర జలాల ఉష్ణోగ్రత కారణంగా మంచు పలకాలు ఏర్పడక పోవడం.. ఏర్పడినా అంత బలంగా ఉండకపోవడంతో ఇవి సముద్రంలో మునిగిపోయి చనిపోతున్నాయి. 2020 ద్వితీయార్థంలో ఈ […]

Penguins |
విధాత: వాతావరణ మార్పులు (Environmental Changes) పలు జంతు, పక్షి జాతుల నాశనానికి దారి తీస్తున్నాయి. చూడగానే ఎంతో ముద్దొచ్చే.. అచ్చం మనిషిలా నడిచే పక్షి జాతి పెంగ్విన్. భారీ మంచు పలకాలు ఏర్పడే ఆర్కిటిక్, అంటార్కిటిక్ మహా సముద్రాల్లో మాత్రమే ఇవి కనపడతాయి.
ప్రస్తుతం పెరుగుతున్న సముద్ర జలాల ఉష్ణోగ్రత కారణంగా మంచు పలకాలు ఏర్పడక పోవడం.. ఏర్పడినా అంత బలంగా ఉండకపోవడంతో ఇవి సముద్రంలో మునిగిపోయి చనిపోతున్నాయి. 2020 ద్వితీయార్థంలో ఈ సమస్య వల్ల వేల కొద్దీ పిల్ల పెంగ్విన్ (Penguins)లు మరణించాయని ఓ నివేదిక తాజాగా బయటపెట్టింది.
మంచుఫలకాలు ఎందుకు కావాలి?
పెంగ్విన్‌లు పుట్టిన తర్వాత.. అవి సముద్రంలో తిరిగే శక్తిని పొందేంత వరకు ఐస్ బర్గ్స్ (Ice Burgs)మీదే నివసించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆడ, మగ పెంగ్విన్‌లు జత కట్టడానికి ఇవి అత్యవసరం. వాటి ఈకలు సముద్ర నీటిని తట్టుకునేలా మారడానికి కాస్త సమయం పడుతుంది. ఆ కారణం తోనూ పిల్లలు పుట్టిన వెంటనే సముద్రంలోకి దిగవు. ఒకవేళ దిగినా వీటి కోసమే కాచుక్కూర్చున్న తిమింగళాలకు, పెద్ద చేపలకు దొరికిపోతాయి.
సాధారణంగా గుంపుగా జీవించే ఇవి పెద్ద సంఖ్యలో తమ కాలనీతో ఒక పెద్ద మంచుపలకపై కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటాయి. ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో అన్ని పెంగ్విన్ కాలనీలకూ మంచు పలకలు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ ఐస్‌బర్గ్ పోటీలో నెగ్గలేని పెంగ్విన్‌లు సముద్రంలోనే తన పిల్లలను వదలాల్సి వస్తోంది. దీంతో కొన్ని పెద్ద చేపలకు ఆహారంగానూ మరికొన్ని అనారోగ్యంతోనూ మృతి చెందుతున్నాయి.
ఇలా 2022 అంటార్కిటికాలో సుమారు నాలుగు కాలనీల పెంగ్విన్‌లు చనిపోయాయని శాటిలైట్ చిత్రాల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది షాక్‌కు గురిచేసే విషయం. అందమైన చిన్న చిన్న పెంగ్విన్‌లు చనిపోయాంటేనే ఊహించుకోడానికి అదోలా ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ వైపరీత్యం ఊహించిందే కానీ .. ఇంత త్వరగా జరుగుతుందనుకోలేదు అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా.పీటర్ ఫ్రెట్‌వెల్ ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణంగా వెర్డీ ఇన్‌లెట్, స్మైలీ ఐలాండ్, బ్రియాంట్ కోస్ట్ సుమారు 1500 కి.మీ. పొడవునా.. నిరంతరం మంచు గడ్డకట్టి ఉంటుంది. ఒకవేళ ఇది కనుక భవిష్యత్తులో మాయమైతే.. పెంగ్విన్‌ల పరిస్థితి తలచుకోడానికే భయంగా ఉందని ఆయన వాపోయారు. మరోవైపు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలో అత్యంత స్వల్ప స్థాయిలో ఐస్‌బర్గ్స్ ఏర్పడ్డాయి.