Gold Rates: దిగొచ్చిన పసిడి ధరలు !

పైపైకి పోతున్న బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా దిగివచ్చాయి.

  • By: Somu |    latest |    Published on : Apr 04, 2025 11:14 AM IST
Gold Rates: దిగొచ్చిన పసిడి ధరలు !

Gold Rates:: పైపైకి పోతున్న బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మొదటి నుండి బంగారం, వెండి ధరలు రాకెట్లగా దూసుకెళ్తూ సామాన్యులకు ఆందోళన కలిగించాయి. పెళ్లిళ్ల సీజన్లలో పసిడి ధరల పరుగులు కొనుగోళ్లను తీవ్రంగా దెబ్బతిశాయి. అంతేకాక వ్యాపార ప్రపంచంలో అలాగే జ్యువెలరీ షాపుల్లో ఆశించినంతగా అమ్మకాలు జరగలేదు. ఇక ఇవాళ బంగారం వెండి ధరలు కాస్త చల్లబడి స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1600తగ్గి రూ.84,000వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1740తగ్గి రూ.91,640వద్ధ ఉంది. బెంగుళూర్, చెన్నై, ముంబైలలోనూ అదే ధర కొనసాగింది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.80,677, 24క్యారెట్లకు రూ.87,164గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.80,383, 24క్యారెట్లకు 85,912గా కొనసాగింది.


వెండి ధరలు కూడా దిగివచ్చాయి.  దేశీయ మార్కెట్ లో  కిలో వెండి ధర  రూ.4వేలు తగ్గి రూ.1,08,000 వద్ధ  కొనసాగుతుంది.