Gold Prices: తగ్గిన బంగారం ధరలు!

Gold Prices: తగ్గిన బంగారం ధరలు!

Gold Prices: నాలుగు రోజులుగా పెరుతుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,150తగ్గి రూ.90,150గా ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,250తగ్గి రూ.98,350గా కొనసాగుతుంది. బెంగుళూర్, చెన్నై, ముంబాయిలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.90,300, 24క్యారెట్లకు రూ.98,500గా ఉంది.

దుబాయ్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ.86,693, 24క్యారెట్లకు రూ.93,587గా ఉంది. అమెరికాలో రూ.87,213, రూ.92,916గా ఉంది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది.