Silver Gold Price|వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. కిలో వెండి ధర మరోసారి పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో వెండి ధర సోమవారం రూ.8000పెరిగి రూ.3,18,000కు పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910పెరిగి రూ.1,45,690కి చేరింది.

Silver Gold Price|వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు

విధాత: బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. కిలో వెండి ధర మరోసారి పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో వెండి ధర సోమవారం రూ.8000పెరిగి రూ.3,18,000కు పెరిగింది. జనవరి 1న కిలో వెండి ధర రూ.2,56,000గా ఉండగా..19వ తేదీకి వచ్చే సరికి రూ.3,18,000కు చేరిన తీరు వెండి ధరల దూకుడుకు నిదర్శనం. డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల లాభార్జన ప్రణాళికలు, పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ అస్థిరత వంటి కారణాలతో వెండి ధరలు మరింత పెరుగతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం మరింత పైకి..

సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910పెరిగి రూ.1,45,690కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,750పెరిగి రూ.1,33,550వద్ద కొనసాగుతుంది. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే బంగారం తులం ధర రూ.1.50లక్షలకు, కిలో వెండి ధర రూ.3.50లక్షలకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది.