Gold Prices: పెరిగిన బంగారం ధరలు!
బులియన్ మార్కెట్ లో మరోసారి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇటీవలి కాలంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి.

Gold Prices : బులియన్ మార్కెట్ లో మరోసారి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,700పెరిగి రూ.85,600కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,940పెరిగి రూ.93,380కి వద్ద కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి. చైన్నై, బెంగుళూరు, ముంబైలో కూడా అదే రేటు కొనసాగుతోంది. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.85,750, 24క్యారెట్లకు రూ.93,530గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 82,110, 24క్యారెట్లకు రూ.88,644గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.78,261, 24క్యారెట్లకు రూ.83,234గా ఉంది. మరోవైపు వెండి కిలో ధర రూ.2000పెరిగింది. మార్కెట్ ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,04,000కు చేరింది.