Gold Prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు !

Gold Prices:  మళ్లీ పెరిగిన పసిడి ధరలు !

Gold Prices:  బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,500పెరిగి రూ.90,250కి చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.2,730పెరిగి రూ.98,460వద్ధ కొనసాగుతోంది.

చైన్నై, బెంగుళూరు, ముంబాయిలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీ 22క్యారెట్ల ధర ర.90,400, 24క్యారెట్లకు రూ.98,160గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.86,259, 24క్యారెట్లకు రూ.93,155గా ఉంది. అమెరికాలో రూ.84,430గా, రూ.90,129గా ఉంది.

వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100తగ్గి రూ.1,07,900వద్ధ కొనసాగుతుంది.