Gold Rate | భారీగా పెరిగిన వెండి.. ఒకే రోజు కిలోకు రూ.3వేలకు పైగా పైపైకి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని, ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశమని మార్కెట్‌ పండితులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి ధరలు ఎప్పటికప్పుడు మారుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల […]

Gold Rate | భారీగా పెరిగిన వెండి.. ఒకే రోజు కిలోకు రూ.3వేలకు పైగా పైపైకి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate |

మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని, ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశమని మార్కెట్‌ పండితులు పేర్కొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి ధరలు ఎప్పటికప్పుడు మారుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,620 పలుకుతున్నది.

నిన్నటితో పోలిస్తే ధరలు మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,760 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60వేల వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,620 పలుకుతున్నది.

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగానే పెరిగాయి.

దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా.. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా ఒకే రోజు రూ.3200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.76,200 పలుకుతున్నది.