Gold Rate | దిగివచ్చిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.100 తగ్గగా.. 24 క్యారెట్ల స్వర్ణంపై రూ.110 వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,510 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,660కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల […]

  • By: Vineela |    latest |    Published on : Aug 16, 2023 4:50 AM IST
Gold Rate | దిగివచ్చిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold Rate |

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.100 తగ్గగా.. 24 క్యారెట్ల స్వర్ణంపై రూ.110 వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,510 వద్ద ట్రేడవుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,660కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60వేలకు దిగివచ్చింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం పసడి రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,510 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.72,800 పలుకున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76వేల వద్ద ట్రేడవుతున్నది.