Gold Rates | మగువలకు షాకిచ్చిన బంగారం.. మళ్లీ పెరిగిన ధరలు..! నేడు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. 24 క్యారెట్ల బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.50 తగ్గి.. రూ.54,650 వద్ద కొనసాగుతున్నది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి తులానికి రూ.59,620 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో […]
Gold Rates |
బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం పెరిగాయి.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. 24 క్యారెట్ల బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.50 తగ్గి.. రూ.54,650 వద్ద కొనసాగుతున్నది.
ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి తులానికి రూ.59,620 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,770కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,620కి పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.55వేలకు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.59,620 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,620 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. మార్కెట్‌లో కిలో వెండి రూ.73వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,200 వద్ద నమోదైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram