Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
వృషభం
ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు రావచ్చు. బంధువులతో మాటపట్టింపులు రావచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఉద్యోగంలో వాదనలు నివారించండి.
మిధునం
వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి మంచి సమాచారం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు అవుతాయి. పాత పనులు పూర్తవుతాయి.
కర్కాటకం
పనులు నెమ్మదిగా సాగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో దేవాలయ దర్శనం చేస్తారు. కుటుంబ విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. ఆస్తి విషయాలు ఆలస్యమవుతాయి.
సింహం
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇంట్లో చిన్నపాటి విభేదాలు వస్తాయి. పనులు ఆలస్యమవుతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది.
కన్య
పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. పనులు సులభంగా పూర్తవుతాయి.
తుల
డబ్బు నిల్వ ఉండదు. అనుకోని సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి తగాదాలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం
మీపై విమర్శలు రావచ్చు. పనులు ఆలస్యమవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తీసుకోవాల్సి రావచ్చు.
ధనస్సు
బంధువులతో చిన్న విభేదాలు వస్తాయి. పని భారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
మకరం
పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. డబ్బు చేతికి వస్తుంది. ఆస్తి సమస్యలు సర్దుబాటు అవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
కుంభం
పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
మీనం
ఇతరుల వల్ల సమస్యలు రావచ్చు. వ్యాపారంలో కొంత ప్రతికూలత ఉంటుంది. ప్రయాణాలు లాభించకపోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో వాదనలు నివారించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram