Gold Rate | మహిళలకు షాక్‌.. ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. హైదరాబాద్‌లో రేటు ఎలా ఉందంటే..?

Gold Rate | మహిళలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గగా.. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు.. గురువారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.రూ.400 పెరిగి రూ.55,850కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి.. రూ.60,930కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే తులం బంగారం రేటు రూ.56వేలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.61,080కు ఎగిసింది. చెన్నైలో 22 […]

Gold Rate | మహిళలకు షాక్‌.. ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. హైదరాబాద్‌లో రేటు ఎలా ఉందంటే..?

Gold Rate |

మహిళలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గగా.. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు.. గురువారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.రూ.400 పెరిగి రూ.55,850కి చేరింది.

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి.. రూ.60,930కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే తులం బంగారం రేటు రూ.56వేలకు చేరింది.

24 క్యారెట్ల బంగారం రూ.61,080కు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,580కు పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,850కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,930 ఎగిసింది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు దేశీయ మార్కెట్‌లో వెండి ధర సైతం రూ.200 పెరిగింది. కిలో రూ.72,800 పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,800కి చేరింది. ఇ

దిలా ఉండగా.. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర (Gold Rate) మళ్లీ పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర అంతర్జాతీయ మార్కెట్‍లో 1,966 డాలర్లు పలుకుతున్నది.