Gold Rate | వెండి ధరలు పైపైకి..! నిలకడగా బంగారం..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Rate | వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న పెరిగిన ధర.. ఆదివారం మరోసారి పెరిగింది. కిలో వెండిపై రూ.400 వరకు పెరిగింది. మరో వైపు వరుసగా రెండోరోజు బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేల వద్ద కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 […]

Gold Rate | వెండి ధరలు పైపైకి..! నిలకడగా బంగారం..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Rate | వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న పెరిగిన ధర.. ఆదివారం మరోసారి పెరిగింది. కిలో వెండిపై రూ.400 వరకు పెరిగింది.

మరో వైపు వరుసగా రెండోరోజు బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేల వద్ద కొనసాగుతున్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,150 వద్ద కొనసాగుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.60వేల వద్ద స్థిరంగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,550 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,800కు పెరిగింది.