Gold Rates | మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | మహిళలకు ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన ధరలు నేడు దిగి వచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి.. రూ.54,150కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.90 తగ్గి.. రూ.59,070 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,220 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి ధర […]

  • By: Vineela |    latest |    Published on : Jul 08, 2023 12:54 AM IST
Gold Rates | మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | మహిళలకు ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన ధరలు నేడు దిగి వచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి.. రూ.54,150కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.90 తగ్గి.. రూ.59,070 పలుకుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,220 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.59,070 పలుకుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,570 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,560కి తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,070 పలుకుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ తదితర జిల్లాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు శనివారం వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండిపై రూ.700 తగ్గి రూ.72,300కు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి ప్రస్తుతం రూ.75,700 పలుకుతున్నది.