TTD Wedding Gift| పెళ్లి చేసుకుంటున్నారా.. టీటీడీ కానుక అందుకోండి ఇలా!

ఫిబ్రవరి 18 నుంచి వివాహాది శుభాకార్యాలు మొదలు కాబోతున్నాయి. పెళ్లి చేసుకునే నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అమూల్య పవిత్ర కానుకలు పంపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు జగద్ రక్షకుడు, లోక కల్యాణ కారకుడైన శ్రీవారి నుంచి మీ కల్యాణానికి అందించే విశిష్ట కానుక కల్యాణ బహుమానం ఎలా పొందాలో టీటీడీ వెల్లడించింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 01, 2026, 4:58 pm IST
Read Time: 3 mins
TTD Wedding Gift| పెళ్లి చేసుకుంటున్నారా.. టీటీడీ కానుక అందుకోండి ఇలా!

విధాత : ఫిబ్రవరి 18 నుంచి వివాహాది శుభాకార్యాలు మొదలు కాబోతున్నాయి. పెళ్లి చేసుకునే నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అమూల్య పవిత్ర కానుకలు పంపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు జగత్ రక్షకుడు, లోక కల్యాణ కారకుడైన శ్రీవారి నుంచి మీ కల్యాణానికి అందించే విశిష్ట కానుక ఎలా పొందాలో టీటీడీ  వెల్లడించింది.

తిరుమల వివాహ కానుక పొందే ప్రక్రియ

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి. వెంటనే తిరుమల నుండి మీకు కల్యాణ బహుమానం పేరిట  ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది.

తిరుమల  శ్రీవారి నుంచి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ క్రింది అడ్రస్ కు కొరియర్ చేయండి. శుభలేఖ మీద ఉన్న మీ చిరునామాకి స్వామి వారి నుంచి కల్యాణ బహుమానం కానుక అందుతుంది. అయితే నెల రోజుల ముందుగానే వాటిని పంపాల్సి ఉంటుందంటున్నారు.

టీటీడీ అడ్రస్ వివరాలు

To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer , Fair Copy Section
TTD Administrative Building
K.T.Road
Tirupati
517507

Tirumala Tirupati Devasthanams(TTD).

ఇప్పటికే పెళ్లి నిశ్చయమైన వారు వెంటనే ఈ అడ్రస్ కు వివరాలు పంపవచ్చు. తిరుపతికి వెళ్లిన వారైతే అదే అడ్రస్ కు వెళ్లి పెళ్లి పత్రిక అందించి కల్యాణ బహుమానం  పొందవచ్చు.