ఒకేరోజు అమాంతం బంగారం, వెండి ధరలు..! మళ్లీ రూ.63వేలు దాటిన పుత్తడి..!

మగువలకు బంగారం ధరలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. ఇటీవల గతంలో ఎన్నడూలేనంత ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే

ఒకేరోజు అమాంతం బంగారం, వెండి ధరలు..! మళ్లీ రూ.63వేలు దాటిన పుత్తడి..!

విధాత‌: మగువలకు బంగారం ధరలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. ఇటీవల గతంలో ఎన్నడూలేనంత ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నా మొన్న స్వల్పంగా తగ్గిన ధరలు నేడు బులియన్‌ మార్కెట్‌లో భారీగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1000 పెరిగి తులానికి రూ.57,650కి ఎగిసింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.1,090 పెరగ్గా.. తులానికి రూ.62,890కి పెరిగింది.


అదే సమయంలో వెండి కిలోకు రూ.2,500 పెరిగింది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం, వెండి ధరలు పోటీపడి పెరుగుతుండడంతో బాబోయ్‌ అనే పరిస్థితి వస్తున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,040కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,490కి పెరిగింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,650.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,890కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.62,890 పలుకుతున్నది. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలోకు ఒకే రోజు రూ.2500 పెరిగింది. ప్రస్తుతం కిలోకు రూ.77,500 చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79,500కి చేరింది.