చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి రూ.63వేల మార్క్‌ను ధాటిన పసిడి..!

బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు

చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి రూ.63వేల మార్క్‌ను ధాటిన పసిడి..!

Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఒక వేళ తగ్గినా.. పెరిగేది కొండంత.. తగ్గేది గోరంత అన్నట్లుగా ఉంటున్నది. ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో గురువారం బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి.


కాగా.. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.350 పెరిగి తులానికి రూ.57,900 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసడిపై రూ.380 పెరిగి తులానికి రూ.63వేల మార్క్‌ను దాటింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,150కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,650కి ఎగిసింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63వేలకు పెరిగింది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం విపరీతంగా పెరిగింది. కిలోకు రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500గా ఉన్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.80,200 వద్ద ట్రేడవుతున్నది