పసిడి ప్రియులకు రిలీఫ్..! నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!
ఇటీవల పుత్తడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడంతో డిమాండ్ పెరిగింది

Gold Rates | ఇటీవల పుత్తడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడంతో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చెన్నైలో ఏకంగా బంగారం ధర రూ.63వేలకుపైగానే పలుకుతున్నది. అయితే, బుధవారం కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రూ.62,620 వద్ద స్థిరంగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,770 వద్ద కొనసాగుతున్నది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,220 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,620 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,620 వద్ద నిలకడగా ఉన్నది. ఇక ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ.500 తగ్గి కిలోకు రూ.77,500 పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,500కి దిగివచ్చింది.