బంగారు గుర్రాలు.. ఎక్కడో తెలుసా?
తెల్లని అశ్వాలు తెలుసు.. నల్ల గుర్రాలు తెలుసు.. ముదురు గోధుమవర్ణంతో మెరిసిపోయేవీ చూశాం! కానీ.. బంగారంలా ధగధగలాడే గుర్రాల గురించి విన్నారా? గుర్రాలు బంగారంలా మెరిసోవడమేంటంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

తుర్క్‌మెనిస్తాన్: తెల్లని అశ్వాలు తెలుసు.. నల్ల గుర్రాలు తెలుసు.. ముదురు గోధుమవర్ణంతో మెరిసిపోయేవీ చూశాం! కానీ.. బంగారంలా ధగధగలాడే గుర్రాల గురించి విన్నారా? గుర్రాలు బంగారంలా మెరిసోవడమేంటంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. వీటికి పెద్ద చరిత్రే ఉన్నది. చాలామందికి వీటి గురించి తెలియదు. అఖల్-టేక్‌మెన్ గుర్రం అని వాటిపేరు. ముద్దుగా బంగారు గుర్రాలని పిలుచుకుంటారు.
తుర్క్‌మెనిస్తాన్‌లోని శుష్క ప్రకృతి దృశ్యాల నుండి వచ్చిన ఈ అశ్వ అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి బంగారు రంగు ఛాయతో ఉంటాయి. సూర్యకాంతి పడితే మెరిసిపోయే బంగారంతో వాటి అద్భుతమైన సారూప్యతతో ఉండే అఖల్- టేక్స్ దృశ్య అద్భుతం మాత్రమే కాదు చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిన జాతి. ఎక్స్ పోస్టులో షేర్ చేసిన వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆశ్చర్యకరమైన క్షణాలను రేకెత్తించింది.
తుర్క్ మెన్ ఎడారుల నుండి ఉద్భవించిన ఈ గుర్రాలు వాటి ఓర్పు, వేగానికి ప్రసిద్ధి చెందాయి. అఖల్-టేక్స్ బంగారు చర్మం వాటి శారీరక పరాక్రమాన్ని మాత్రమే కాకుండా తుర్క్ మన్ ప్రజల సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా ప్రతిబింబిస్తుంది. ఎక్స్ పోస్టులో ఈ అరుదైన జీవి హాట్ స్పాట్ గా మారింది. ఇది ప్రకృతి యొక్క అద్భుతం, అద్భుత కథ లాంటిది అని యూజర్లు స్పందించారు. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్‌కూడా పనిచేస్తున్నది.