Sadha | మంచి మంచి కట్టుబాట్లు.. హీరోయిన్ సదా పెళ్లి చేసుకోదట..!

Sadha | వివాహం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అమ్మానాన్నలు బలవంతం చేశారనో.. లేక బంధువులు, స్నేహితులు అడుగుతున్నారనో వివాహం చేసుకోలేం. అయితే పెళ్ళి ఎప్పుడనే ప్రశ్నలు మామూలు జనాలకన్నా, సినిమావాళ్ళకు కాస్త ఎక్కువగానే ఎదురవుతాయి. కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎవరూ అడగరు కానీ, పెళ్ళి వయసు దాటుతున్నా, కెరియర్ డల్ అయినా హీరోలకీ, హీరోయిన్స్‌కి మామూలుగా ఎదురయ్యో ప్రశ్నే ఇది. అయితే వివాహ విషయంలో సరైన సమయానికి నిర్ణయం తీసుకోవాలని, బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా […]

  • By: krs    latest    Jul 14, 2023 12:16 PM IST
Sadha | మంచి మంచి కట్టుబాట్లు.. హీరోయిన్ సదా పెళ్లి చేసుకోదట..!

Sadha |

వివాహం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అమ్మానాన్నలు బలవంతం చేశారనో.. లేక బంధువులు, స్నేహితులు అడుగుతున్నారనో వివాహం చేసుకోలేం. అయితే పెళ్ళి ఎప్పుడనే ప్రశ్నలు మామూలు జనాలకన్నా, సినిమావాళ్ళకు కాస్త ఎక్కువగానే ఎదురవుతాయి. కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎవరూ అడగరు కానీ, పెళ్ళి వయసు దాటుతున్నా, కెరియర్ డల్ అయినా హీరోలకీ, హీరోయిన్స్‌కి మామూలుగా ఎదురయ్యో ప్రశ్నే ఇది.

అయితే వివాహ విషయంలో సరైన సమయానికి నిర్ణయం తీసుకోవాలని, బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా దేనికీ పనికిరావనే పాతకాలం సామెతల్ని పక్కన పడేసి మరీ అక్కడ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, ఇక్కడ టాలీవుడ్‌లో ప్రభాస్ ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు.

అయితే దీనికి ఏమాత్రం తీసిపోకుండా హీరోలతో సమంగా హీరోయిన్స్ కూడా పెళ్ళికి ఎస్ గానీ, నో గానీ చెప్పకుండా నలభై ఏళ్ళొస్తున్నా పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. అటు బాహుబలి భామ అనుష్క శెట్టి కూడా పెళ్ళికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే ‘జయం’ హీరోయిన్ సదా కూడా నలభైకి దగ్గర పడుతున్నా పెళ్ళి మీద ఇంట్రస్ట్ లేదని చెబుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే..

ఓ ఇంటర్వ్యూలో సదా మాట్లాడుతూ.. పెళ్ళి చేసుకోకపోవడం వల్లే తను స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్ళి తర్వాత అభిరుచికి తగ్గట్టుగా నడుచుకోవడం కష్టమని చెప్పింది. వివాహ బంధంలో ఎన్నో రాజీలు ఉంటాయి. మన అభిరుచిని ఇష్టపడని వాళ్ళు మన జీవితంలోకి రావచ్చు.

దీనితో వైవాహిక జీవితంలో ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి పెళ్ళి చేసుకుని, అభిప్రాయభేధాలతో విడిపోవడం కన్నా దానికి దూరంగా ఉండటమే బెటర్ అని తేల్చేసింది సదా. ఇలా పెళ్ళిని వ్యతిరేకించి లేడీ బ్యాచులర్స్‌గా మిగిలి పోయిన శోభన, టబు, నగ్మా, అనుష్కల జాబితాలోకి సదా కూడా చేరినట్టే.

సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, ఫోటోగ్రాఫర్‌గా పులులు, సింహాలు, ఇతర జంతువులను క్లిక్ మనిపిస్తూనే.. ఇటు సినిమా ఛాన్స్‌లు తగ్గాకా డాన్స్ రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తుంది. ‘జయం’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి.. మంచి నటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఈమధ్య సదా ‘అహింస’ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది.