Vijay | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూట్‌లోనే విజ‌య్ వెళుతున్నాడా .. మ‌రి కొద్ది రోజుల‌లో రానున్న స్ప‌ష్ట‌త‌

Vijay | జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తరహాలోనే, తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా ఇప్పుడు తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? వేలూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఈ చర్చకు తావిచ్చాయి

  • By: sn |    movies |    Published on : Feb 24, 2026 9:40 AM IST
Vijay | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూట్‌లోనే విజ‌య్ వెళుతున్నాడా .. మ‌రి కొద్ది రోజుల‌లో రానున్న స్ప‌ష్ట‌త‌

Vijay | జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తరహాలోనే, తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా ఇప్పుడు తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? వేలూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఈ చర్చకు తావిచ్చాయి.టీవీకే పార్టీ అధ్యక్షుడిగా విజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించే సభలకు డీఎంకే ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని, అందువల్ల రాష్ట్ర ప్రజలను పూర్తిగా కలుసుకునే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విజ‌య్ ఎమోష‌న‌ల్..

టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చిన విజయ్, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, నేరాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయేవి సాధారణ ఎన్నికలు కాదని, ప్రజలు మరియు అవినీతి పాలన మధ్య జరిగే యుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేయడం అంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల భయంతో స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల సమయంలో విజయ్ భావోద్వేగానికి లోనవ్వగా, సభలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని విజయ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తర చెన్నై పరిధిలోని పెరంబూర్ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో నియోజకవర్గంపై ఇంకా స్పష్టత రాలేదు.గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇలా రెండు చోట్ల పోటీ చేయ‌డం మ‌నం చూశాం. ఇక ఇదిలా ఉంటే, విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ సెన్సార్ వివాదాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సీబీఎఫ్‌సీ నిర్ణయానికి వ్యతిరేకంగా మేకర్స్ కోర్టును ఆశ్రయించినా, తరువాత కేసును ఉపసంహరించుకుని రివిజన్ కమిటీకి పంపించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టత రాకపోయినా, తమిళనాడు ఎన్నికలు ముగిసిన రెండు నెలల తర్వాత జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.