DSC 2023 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో DSC నోటిఫికేషన్

DSC 2023 విధాత: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్ పోస్టుల కోసం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ పోస్టులను   భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ ఓ ప్రకటణలో వెల్లడించారు. ఈ మేరకు ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆగష్టులో ఈ ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు బొత్స తెలిపారు. అలాగే ఉపాధ్యాయ […]

DSC 2023 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో DSC నోటిఫికేషన్

DSC 2023

విధాత: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్ పోస్టుల కోసం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ ఓ ప్రకటణలో వెల్లడించారు. ఈ మేరకు ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

ఆగష్టులో ఈ ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు బొత్స తెలిపారు. అలాగే ఉపాధ్యాయ బదిలీలపై సమీక్ష నిర్వ‌హించామన్నారు, ఈ బదిలీలలో పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి బొత్సా సత్యనారయణ పేర్కొన్నారు.