ఇక ఈ ఫోన్లలో గూగుల్ క్రోమ్ పని చేయదు..! కారణం ఏంటంటే..?
ప్రతి స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ క్రోమ్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. చాలా మంది గూగుల్ క్రోమ్‌ను విరివిగా ఉపయోగిస్తూ వస్తుంటారు

విధాత: ప్రతి స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ క్రోమ్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. చాలా మంది గూగుల్ క్రోమ్‌ను విరివిగా ఉపయోగిస్తూ వస్తుంటారు. అయితే, వాట్సాప్ ఆండ్రాయిట్ నౌగట్ 7.1లో క్యాలెండర్, క్రోమ్‌కు సపోర్ట్‌ను గూగుల్‌ను నిలిపివేయనున్నది. పాత వెర్షన్లను సపోర్ట్ ఇవ్వడం ఖరీదైంది కావడంతో పాటు సమయం సైతం భారీగా తీసుకుంటుంది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 వెర్షన్‌కు దిగువన ఉండే వెర్షన్లలో గూగుల్ క్రోమ్ అప్‌డేట్ అందుబాటులో ఉండబోదని గూగుల్ పేర్కొంది.
ఈ యాప్‌ను ఓపెన్ చేస్తే వినియోగదారులను ఆండ్రాయిడ్ ఓరియో 8.0 లేదంటే.. అంతకంటే ఎక్కువ ఉన్న వెర్షన్‌ను అప్‌డేట్ చేయాలని కోరుతూ పాప్‌అప్ మెస్సేజ్ చూపించనున్నదని గూగుల్ పేర్కొంది. అయితే, గూగుల్ క్యాలెండర్‌కు సపోర్ట్ ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియరాలేదు. ఈ ఏడాది గూగుల్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ వివరాలను ఆండ్రాయిడ్ స్టూడియోలో అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో దాదాపు 3శాతం మాత్రమే రన్ అవుతున్నది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఓఎస్ వెర్షన్ నుంచి యాప్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నది. యూజర్లు తక్కువగా ఉన్నందున సపోర్ట్ అందించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత వెర్షన్లలో యాప్‌ని ఉపయోగించడం కొనసాగిస్తే ప్రమాదకరంగా మారనున్నది. పాత వెర్షన్లలో యాప్స్‌ను కొనసాగించడం ప్రమాదకరమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. హ్యాకర్లు డివైజెస్‌ను సులభంగా యాక్సెస్ చేయగలరని.. వీటికి కనీసం సెక్యూరిటీ సపోర్ట్ సైతం లభించదని చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో ఓల్డ్ వెర్షన్ మొబైల్స్‌ను వినియోగించడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు