Vivo | వీవోకు షాకిచ్చిన కేంద్రం..! మొబైల్స్‌ ఎగుమతిపై బ్యాన్‌..!

Vivo | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వీవోకు చెందిన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దాదాపు 27వేల స్మార్ట్‌ఫోన్లను వారం రోజులపాటు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. డివైస్‌ మోడల్స్‌, వాటి విలువ గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ మొబైల్స్‌ ఎగుమతిపై నిషేధం విధించింది. చైనీస్‌ కంపెనీ మోడల్స్‌తో పాటు ధరకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. […]

Vivo | వీవోకు షాకిచ్చిన కేంద్రం..! మొబైల్స్‌ ఎగుమతిపై బ్యాన్‌..!

Vivo | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వీవోకు చెందిన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దాదాపు 27వేల స్మార్ట్‌ఫోన్లను వారం రోజులపాటు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. డివైస్‌ మోడల్స్‌, వాటి విలువ గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ మొబైల్స్‌ ఎగుమతిపై నిషేధం విధించింది. చైనీస్‌ కంపెనీ మోడల్స్‌తో పాటు ధరకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఎగుమతి చేయకుండా నిషేధం విధించిన ఫోన్ల విలువ 15 మిలియన్‌ డాలర్ల అంటే దాదాపు రూ.123 కోట్లు. వీవో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కో తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లను న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ నిషేధించింది. అయితే, ఇప్పటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, వీవో ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. వీవోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ అధికారులకు లేఖ రాసినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. 2020 గాల్వాన్‌ లోయ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత చైనీస్‌ యాప్‌లను నిషేధించాలని డిమాండ్‌ పెరిగ్గా 2020 నుంచి దాదాపు 300 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత చైనా కంపెనీలపై కేంద్రం నిఘా పెంచింది. చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు మనీ లాండరింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈడీ అధికారులు చైనా సంస్థతో పాటు ఇతర సంస్థలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీవో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాయి. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వీవో ఫోన్‌లను ఇతర దేశాలకు తరలించడం గమనార్హం.