Amazon | అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సేల్‌.. డీల్స్‌ని అస్సలు మిస్సవ్వొద్దు..!

Amazon | అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సేల్‌.. డీల్స్‌ని అస్సలు మిస్సవ్వొద్దు..!

Amazon | భారత్‌లో ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది. స్మార్ట్‌ ఫోన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ సేల్స్‌ను ప్రారంభించింది ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఐక్యూ, హానర్‌ తదితర టాప్‌ మోడల్స్‌పై డిస్కౌంట్స్‌ను ఇస్తున్నది. వన్‌ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 12ఆర్ 5జీ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్‌తో కలిపి రూ.38,900 ఇస్తున్నది. ఈ మొబైల్‌ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4కే రూ.24,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 2412 బై 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, స్క్రీన్ టు బాడీ రేషియో 93.40 శాతం, ఫ్లూయిడ్ యానిమేషన్ల కోసం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్స్‌తో ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

పోకో ఎం6 ప్రో 5జీపై..

పోకో ఎం6 ప్రో 5జీ ప్రీమియం లుక్‌లో వస్తుంది. డిజైన్‌ యూజర్లు ఆకట్టుకుంటున్నది. ఈ మొబైల్‌ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ ఏఐ కెమెరా, 6.79 డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉండగా.. ఈ మొబైల్‌ రూ.9,999 అందుబాటులో ఉన్నది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.10,999కే అమెజాన్‌ అందిస్తున్నది. ఈ మొబైల్‌ 50 ఎంపీ ఏఐ కెమెరా, డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే , 5జీ 6ఎన్ఎం ప్రాసెస్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇక శాంసంగ్‌ గెలాక్సీ ఎం 14 5జీ మొబైల్‌ రూ.11,999గా నిర్ణయించారు. ఈ మొబైల్‌ 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే సెటప్‌ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ బెస్ట్ డీల్‌కు అందిస్తున్నది. బ్యాంక్‌, కూపన్‌ ఆఫర్లతో కలిపి రూ.69,999కే ఆఫర్‌ చేస్తున్నది.

ఈ మొబైల్‌లో సర్కిల్ టు సెర్చ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ ఐఎస్పీ, 6.2 అంగుళాల ఎఫ్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఫీచర్లు వీటితో పాటు ఐక్యూ జెడ్9 మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్‌తో పాటు రూ.17,999కే సొంతం చేసుకునే వీలుంది. మోషన్ కంట్రోల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఫీచర్స్‌, సోనీ ఐఎంఎక్స్ 882 ఓఐఎస్ స్లీక్ డిజై‌న్‌తో వస్తుంది. ఐసీసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డుతో కొనుగోలు చేసే యూజర్లకు 5శాతం, నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కి 3శాతం, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తించనున్నది. అమెజాన్‌ పే లేటర్‌ ద్వారా అర్హులైన వినియోగదారులకు రూ.60వేల వరకు పే లేటర్‌ సదుపాయం పొందే వీలుంటుంది.