Marriage | వ‌రుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని.. తాళి క‌ట్టించుకోని పెళ్లి కూతురు

Marriage | ముహుర్త స‌మయానికి ఓ పెళ్లి కూతురు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. పెళ్లి కుమారుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని, వ‌య‌సు కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లుంద‌ని చెప్పి.. తాళి క‌ట్టించుకోలేదు పెళ్లి కుమార్తె. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని భ‌గ‌ల్‌పూర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌స‌ల్‌పూర్‌కు చెందిన ఓ యువ‌తికి గ‌త సోమ‌వారం పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే సోమ‌వారం రాత్రి పెళ్లి మండ‌పానికి వ‌రుడు చేరుకున్నాడు. […]

Marriage | వ‌రుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని.. తాళి క‌ట్టించుకోని పెళ్లి కూతురు

Marriage | ముహుర్త స‌మయానికి ఓ పెళ్లి కూతురు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. పెళ్లి కుమారుడు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని, వ‌య‌సు కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లుంద‌ని చెప్పి.. తాళి క‌ట్టించుకోలేదు పెళ్లి కుమార్తె. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని భ‌గ‌ల్‌పూర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌స‌ల్‌పూర్‌కు చెందిన ఓ యువ‌తికి గ‌త సోమ‌వారం పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే సోమ‌వారం రాత్రి పెళ్లి మండ‌పానికి వ‌రుడు చేరుకున్నాడు. ఇక ముహుర్త స‌మ‌యం కూడా రానే వ‌చ్చింది. అంత‌లోనే పెళ్లి కూతురు అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది.

పెళ్లి కుమారుడు త‌న కంటే న‌ల్ల‌గా ఉన్నాడ‌ని, వ‌య‌సు కూడా ఎక్కువగా ఉంద‌ని పెళ్లి కూతురు చెప్పింది. త‌న‌కు అత‌నితో పెళ్లి ఇష్టం లేద‌ని స్ప‌ష్టం చేసింది. తిల‌కం పెట్టించుకోలేదు. తాళి క‌ట్టించుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల స‌భ్యులు ఆమెకు స‌ర్ది చెప్పేందుకు య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చేసేదేమీ లేక పెళ్లి మండ‌పం నుంచి వ‌రుడి కుటుంబ స‌భ్యులు వెళ్లిపోయారు.