GUDURU | అవినీతిపై CM మాటలు.. హైకోర్టు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టాలి: గూడూరు
GUDURU NARAYANA REDDY తనిఖీ చేయకుంటే రూ.5,310 కోట్లు ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్లొచ్చు.. ఒక్కో ఎమ్మెల్యే రూ. 44 కోట్లు లంచాల ద్వారా పొందే అవకాశం విధాత: దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవినీతితో పథకం ‘అవినీతి బంధు’గా మారకుండా స్వయంగా విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని ఆయన […]

GUDURU NARAYANA REDDY
- తనిఖీ చేయకుంటే రూ.5,310 కోట్లు ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్లొచ్చు..
- ఒక్కో ఎమ్మెల్యే రూ. 44 కోట్లు లంచాల ద్వారా పొందే అవకాశం
విధాత: దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవినీతితో పథకం ‘అవినీతి బంధు’గా మారకుండా స్వయంగా విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని ఆయన శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 27న జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్ల జాబితా తన వద్ద ఉందని సీఎం చెప్పారని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని అన్నారు.
ఈ పథకం ‘అవినీతి బంధు’గా మారకుండా ఉండాలంటే హైకోర్టు తక్షణమే రంగంలోకి దిగి స్వీయ విచారణ చేపట్టాలని, లంచం తీసుకున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించాలని, ఈ అంశంపై రాజ్యాంగ బద్ధ సంస్థతో విచారణకు ఆదేశించాలని హైకోర్టు ముఖ్యమంత్రిని కోరాలని ఆయన అన్నారు.
అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల పేర్లు తన వద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొనడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దళిత బంధు పథకం కింద ఎంపిక చేసేందుకు అర్హులైన వారి నుంచి లంచాలు తీసుకుంటున్నారని అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఆ ఆరోపణలు నిజమని తేలిందని అన్నారు.
దళిత బంధు పథకాన్ని 2021 జూలైలో ప్రకటించారని, దీని ద్వారా ఎంపికైన దళిత కుటుంబానికి స్వయం ఉపాధి పొందేందుకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, అప్పటి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో ఓడిపోయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో దళితుల ఓట్లను ఆకర్షించేందుకు దీన్ని ఉపయోగించారని ఆయన వివరించారు.
ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.17,700 కోట్లు కేటాయించారని రాష్ట్రంలోని 1.77 లక్షల మంది దళితులకు ఈ పథకం లబ్ది కోసం ప్రతిపాదించారన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఎమ్మెల్యేలు మరియు వారి అనుచరులు పథకం నుండి ప్రయోజనం పొందడానికి వారి పేరును క్లియర్ చేయడానికి అర్హులైన వ్యక్తుల నుండి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నారని “అంటే దాదాపు రూ. 5,310 కోట్లు చేతులు మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత పెద్ద ప్రజా ధనాన్ని దోచుకోవడం తప్ప మరొకటి కాదని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1,475 మంది దళితులను ఎంపిక చేయాలని ప్రతిపాదించారని అంటే ఒక్కో ఎమ్మెల్యే దాదాపు 44 కోట్లు దోచుకోవడానికి ప్రమాదం ఉన్నదని నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు సిపారసు చేసే అధికారం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి పథకంలో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని ఆరోపించారు.